రాచ విద్యాసాగర్ గురుస్వామి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం రోజు దేవాలయం వ్యవస్థాపక ట్రస్ట్ చైర్మన్ రాచ విద్యాసాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో హరిహర పుత్ర అయ్యప్పస్వామి దేవస్థానంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.అలాగే అయ్యప్పస్వామి దేవస్థానంలో ఈరోజు నుండి అయ్యప్ప దీక్షాపరులకు మహా అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వాములకు మొదలవుతుంది. నేటి నుండి నిర్విరామంగా నవంబర్ 15 నుండి జనవరి 13-01-2025 వరకు ఈ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి భక్తులు,ప్రజలు విరివిరిగా వస్తురూపేనా,ధన రూపేనా విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవస్థానం ట్రస్ట్ చైర్మెన్ రాచ విద్యాసాగర్ గురుస్వామి మరియు ధర్మకర్తలు కూన సురేష్,దుబ్బా విశ్వనాథం, మడుపులింగారెడ్డి,కల్లూరి రాజు,ఎర్రం శంకర్,బోప్ప దేవన్న,కొండినారాయణ,అన్నల్ దాస్ అనిల్,గడ్డం నాగరాజు,అయ్యప్ప స్వాములు సిరిసిల్ల పట్టణ ప్రజలు పాల్గొన్నారు.