| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు" : సైకాలజిస్ట్ పున్నంచందర్

"ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు" : సైకాలజిస్ట్ పున్నంచందర్

జీవించి సాధించాలి

ప్రభుత్వం అండగా ఉంది 

కార్మికుల మనోధైర్య సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ పిలుపు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్లలోని గణేష్ నగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మనోధైర్య సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతు ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని, మనోధైర్యంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చెయ్యాలని అన్నారు.

ప్రభుత్వం అండగా ఉందని తెలుపుతు వస్త్ర పరిశ్రమ బాగు కోసం, కార్మికులకు నిరంతరం పని కల్పించేందుకు కృషి చేస్తుందని అన్నారు.

మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెను వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యాలని అన్నారు.

సమస్యల పట్ల అతిగా ఆలోచించినప్పుడే ఆత్మహత్య లాంటి ప్రమాదకర ఆలోచనలు వస్తాయని అన్నారు. 

ప్రతి సమస్యకూ పరిష్కారం మార్గం వుంటుందని తెలిపారు.

సరైన దృక్పధంతో ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని అన్నారు.

21 వ వార్డు గణేష్ నగర్ కౌన్సిలర్ వేముల రవి మాట్లాడుతు మానసిక సమస్యల పరిష్కారం కోసం మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీని సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ వేముల రవి, మనో వికాస కేంద్రం సిబ్బంది వేముల అన్నపూర్ణ, బూర శ్రీమతి, కొండ ఉమ , రాపెల్లి లత మరియు కార్మికులు పాల్గొన్నారు.

Previous శబరిమలలో చాట్‌బాట్‌... యాత్రికుల కోసం ‘స్వామి’ పేరుతో ఏర్పాటు..
Next తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే – ఎంపీ అరవింద్
ADVERTISEMENT