పోలీస్ స్టేషన్లో వారిదే పెత్తనం
ఒకరు సీనియర్ కానిస్టేబుల్ అంటా
ఒకరు ఏది చెప్తే అదే నడవల్సిందే
సమయ పాలన ఉండదు చెప్పేవారు ఉండరు
నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఓ హోంగార్డ్, పీసీ లాదే పేత్తనం
హోంగార్డు నుంచి ఏ ఎస్సై వరకు డబ్బులు ఇస్తే ఏదైనా పని జరిగిపోతుంది
కొత్త లేదు పాత లేదు వారు చెప్పిందే ఎస్సై వినాలి
ఎవ్వరైనా ముందు సీనియర్ కానిస్టేబుల్ ను కలవలంటా
డైలీ భారత్, వరంగల్: నందిపేట్ మండల పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డు చేతివాటం ప్రదర్శిస్తు అందరి వద్ద డబ్బులు డిమాండ్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. స్టేషన్ లో ఇతను కేవలం హోంగార్డు అయితే నందిపేట పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. డ్యూటీ టైం అంటూ ఏమి ఉండదు ఇతను ఎప్పుడు వస్తే అప్పుడే డ్యూటీ పోలీస్ డ్రెస్ లో కంటే సివిల్ డ్రెస్ లోనే ఎక్కువగా కనిపిస్తాడు .చూస్తే పోలీస్ అంటే నమ్మరు అలా ఉంటది అతని స్టైల్ ఇతని హైఫై మెయింటెనెన్స్ చూసి కానిస్టేబుల్ లే ఆశ్చర్యపోతున్నారు. ఆపరేటర్ గా చేస్తుండటంతో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులను ఇబ్బందులకు గురి చేస్తు పైసలు వసూలు చేస్తున్నట్లు చాలా ఇబ్బందులకు గురి చెయ్యడం ఆయనకు అలవాటు అయిపొయింది. ఇప్పటివరకు ఇతని బాదితులు చాలానే ఉన్నారు ముఖ్యంగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన వారి నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు డబ్బులు ఇవ్వకుంటే ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కు వచ్చిన నిర్లక్ష్యపు సమాధానం రేపు రాపో ఎల్లుండి రాపో అంటూ ఇబ్బండిపెడతాడు దీంతో విసిగిన జనం పైసలు ఇచ్చేందుకే ముగ్గు చూపుతున్నారు. బైకులు పోయిన బాధితుల ఫిర్యాదు నమోదు చేయాలంటే కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అలాగే పేకాటలో దొరికిన వ్యక్తులు మంచి భారీగానే వసూలు చేస్తున్నట్టు సమాచారం ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఇతని పై విచారణ చేపట్టాలని జనం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు దీనిపై మరి పోలీస్ అధికారులు ఏం చేస్తారో చూడాలి మరి...