డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: డిసెంబర్ 1 న హైదరాబాద్ లో వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే మాలల సింహ గర్జన సభను లక్షలాది మందితో జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మాలలు 30 లక్షల మంది ఉన్నారని రాష్ట్ర జనాభాలో రెండో స్థానంలో ఉన్నా మాలలను తక్కువచేసి చూపుతూ అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారనీ చెప్పారు. మాలల ఐక్యతతో రాజకీయ పార్టీలకు తడాఖా చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్ లో నిర్వహించే మాలల సింహ గర్జన సభతో మాలలు సత్తా చాటాలనీ ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు.
News
డిసెంబర్ 1న జరిగే హైదరాబాద్ సభతో మాలలు సత్తా చాటాలి: మంద రంజిత్ కుమార్