| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మానవత్వం చాటుకున్న భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై మరియు సిబ్బంది

మానవత్వం చాటుకున్న భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై మరియు సిబ్బంది

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న మాడుగుల సత్యనారాయణ హెచ్ జి నెంబర్ 901 గారి భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడం జరిగింది. ఆమె అనారోగ్య దృష్ట్యా హైదరాబాదులో బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది. ఇంకా ఆమె పూర్తిగా కోలుకోలేదు, ఆపరేషన్ తర్వాత ప్రతిరోజు ఫిజియోథెరపీ కోసం 30000 ఖర్చు అవుతుండగా అతని ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకొని భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి మానవతా దృక్పథంతో ఆమె వైద్యం కోసం 22,000 డబ్బులను హోంగార్డ్స్ ఇంచార్జ్ శేషు గారికి అందజేయడం జరిగింది. హోంగార్డు కుటుంబానికి సహాయం చేసిన ట్రాఫిక్ ఎస్ఐ మరియు వారి సిబ్బందికి హోంగార్డ్స్ తరఫున శేషు గారు ధన్యవాదాలు తెలియజేశారు..

Previous దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
Next ఆ ఆఫీసు నిండా ఏజెంట్లే.. ప్రజలను పీడిస్తున్న ఏజెంట్ల వ్యవస్థ..
ADVERTISEMENT