| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వ్యాపార సముదాయాలను వీధి వ్యాపారులకు అధికారికంగా అప్పగించాలి :

వ్యాపార సముదాయాలను వీధి వ్యాపారులకు అధికారికంగా అప్పగించాలి :

ఎవరు ముందుకు రాని యెడల ముందుకు వచ్చిన నిరుపేదలకి ఇవ్వాలి

వీధి వ్యాపారాల దరఖాస్తులు మున్సిపల్ అధికారులు స్వీకరించాలి

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న వీధి వ్యాపారుల దుకాణాలు అనధికారికంగా కేటాయించడాన్ని నిలిపివేయాలి

ఏకగ్రీవ నిర్ణయంతో అధికారుల పర్యవేక్షణలో షాపులు పంపిణీ చేయాలి

షాపులు కేటాయించడంలో అవకతవకలు జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది

సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ ఏరియా, త్రీ టౌన్ ఏరియా రైల్వే స్టేషన్ లైన్, ప్రభుత్వాసుపత్రి ఏరియాలో నిర్మించిన సుమారు 100 వ్యాపార సముదాయాన్ని ఒకేసారి అధికారికంగా వీధి వ్యాపారులకు అప్పగించాలని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ డిమాండ్ చేశారు. వీధి వ్యాపారులు ముందుకు రాకపోతే 36 వార్డుల నుంచి ముందుకు వచ్చిన నిరుపేదలకు ఆ వ్యాపార సముదాయ దుకాణాలను అప్పగించాలని ఆయన కోరారు. దుకాణాలు అప్పగించడంలో ఎలాంటి అవకతవకలు జరిగిన అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వ్యాపార సముదాయాలను అధికారికంగా అప్పగించాలని అనధికారికంగా ఎవరికి వారు పంపిణీ చేయవద్దని ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీ అధికారులకు సూచించారు.

Previous TPTF సమావేశంలో పాల్గొన్న మండల అధ్యక్షులు వై క్రాంతి కుమార్
Next పెళ్లి చేసుకోవాలని కోరినందుకు గర్భవతిని కడతేర్చిన ప్రియుడు
ADVERTISEMENT