Posted on 2024-10-16 18:54:43
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి బుదవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా గ్రంథాలయంలోని తన చాంబర్‌లో నియామక పత్రంపై, హాజరు పట్టీలో సంతకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తనను ఈ పదవిలో నియమించిన సీఎం రేవంత్‌రెడ్డికి, సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గ్రంథాలయ సంస్థపై ఇప్పటికీ అవగాహన లేదని, త్వరలో
అధికారులు, సిబ్బందితో కలిసి అన్ని వివరాలు తెలుసుకుంటానని తెలిపారు. ఆగిపోయిన నూతన భవన నిర్మాణం, డిజిటల్ లైబ్రరీపై
దృష్టిసారిస్తానన్నారు. మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలపై ఫోకస్ పెడతానని పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, వీర్లపల్లి శంకర్,ప్రకాష్ గౌడ్,రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు చైర్మన్ మధుసూదన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు, శాలువాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >