| Daily భారత్
Logo




ఫీజు బకాయలు విడుదల చేయండి : ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు

News

Posted on 2024-10-15 15:08:44

Share: Share


ఫీజు బకాయలు విడుదల చేయండి : ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు, ఆధ్యాపకులు రోడ్డెక్కారు. బుధవారం శాతవాహన యునివర్సిటీ డిగ్రీ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నేతలు కొలనూరు శేఖర్ రెడ్డి, గుగ్గిళ్ల జగన్ గౌడ్, గెంట్యాల భూమెష్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు బకాయలు విడుదల చేయకపోవడంతో కళాశాలల్ని నిర్వహించలేకపోతున్నామని ఆవేదన చెంచారు. భవనాల అద్దెలు, అధ్యాపకుల వేతనాలు, నిర్వహణ ఖర్చుల కోసం చేసిన అప్పులు వడ్డీలతో కలిపి తడిసి మోపెడయ్యాయాన్నరు. పాత అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక పండుగ పూట అధ్యాపకుల చేతనాలు కూడా ఇవ్వలేకపోయామన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో పాటు అన్ని నియోజక వర్గాల శాసన సభ్యులకు వినతి పత్రాలిచ్చామని, శాంతి యుత దీక్షలతో నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదని ఆరోపించారు. ఉన్నత విద్య లక్ష్యాన్ని నీరుగారుస్తూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఆర్టీ ఎఫ్ విధులను విడుదల చేయాలని కోరారు.

కార్యక్రమంలో సంఘ నాయకులు బాల్ రెడ్డి, రాజేశ్, అధ్యాపకులు అజీమ్ పాషా, దామెర స్వామి, లక్ష్మణ్, చిటికెన వేణుగోపాల్, కిరణ్, వేణుమారవ్, చక్రపాణి, మధు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 18:36:22

Readmore >
Image 1

పంజాబ్‌లో ప్రభుత్వమూ బీజేపీదేనా.?

Posted On 2026-04-26 18:30:28

Readmore >
Image 1

కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి

Posted On 2026-04-26 18:18:14

Readmore >
Image 1

కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు

Posted On 2026-04-26 18:16:27

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 18:14:44

Readmore >
Image 1

ఎస్సై చైతన్య చందర్ పై వేటు

Posted On 2026-04-26 12:36:35

Readmore >
Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >
Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >
Image 1

హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

Posted On 2026-04-26 07:51:25

Readmore >