డైలీ భారత్, సిరిసిల్ల : ఈ రోజు 10వ వార్డ్ పరిధిలోని ముష్టిపెల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద, స్తానిక కౌన్సిలర్ బోల్గo నాగరాజు గౌడ్, మరియు అంబేద్కర్ కుల సంఘ పెద్దల ఆధ్వర్యంలో DR. BR అంబేద్కర్ విగ్రహానికి మరియు మనదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి పాలభిషేకం చేయడం జరిగినది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్నటి రోజున హైదరాబాదులో నిర్వహించిన అణగారిన వర్గల విశ్వరూప మహాసభలో పాల్గొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి న్యాయమైన డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించి ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ ఏస్తామని చెప్పి సాధ్యమైనంత త్వరలో ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తామని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు తెలియజేశారు. దీనికిగాను పదవ వార్డ్ ఎస్సీ వర్గాల పక్షాన మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా అభివృధి చేశాడు. ప్రధానమంత్రి గడిచిన పది సంవత్సరాలలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని కొత్త మలుపులు తిప్పారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణo మరియూ ముస్లిం మహిళల్లో వివక్షతను నిర్మూలించడానికి త్రిపుల్ తలాక్ బిల్లు, అఖండ భారత్ లక్ష్యంగా ఆర్టికల్ 370 రద్దు, పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా సర్జికల్ స్ట్రైక్, బీసీ కమిషన్కు రాజ్యాంగ బద్ధ హోదా, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, భారతదేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని ఒకసారి దళితులకు మరొకసారి గిరిజన మహిళకు ఇచ్చి బిజెపి వారి పట్ల గల చిత్తశుద్ధిని చాటుకుంది.కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి పనులు చేయాల్సి ఉంది ఇట్టి విషయాలను గ్రహించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీలు అండగా నిలిచి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కొత్త శక్తిని ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్న. అధికారంలోకి వచ్చి పదేళ్లు గడుస్తున్న ఇక్కడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు చేసింది ఏమి లేదు ,దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళిత ముఖ్యమంత్రి చేస్తానని, అందరికీ దళిత బంధు ఇస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి దళితులను మోసం చేసిన కేసీఆర్, ఈరోజు 18 మంది మంత్రులు ఉండే తెలంగాణ క్యాబినెట్లో మాదిగలకు కనీస స్థానం కల్పించకుండా అవమానించిన తీరు మీరు గ్రహించి ఈ ఎన్నికల్లో కెసిఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్న. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీలు ఒక్కటే ఆయా నియోజకవర్గాల్లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
News