| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జానీ మాస్టర్ కి మద్యంతర బెయిల్ మంజూరు

జానీ మాస్టర్ కి మద్యంతర బెయిల్ మంజూరు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇటీవల జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మతం మార్చుకొమ్మని పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టాడని ఆరోపణలు చేసింది. ఈ కేసులో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసారు. గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఇటీవల పోలీసుల విచారణలో పాల్గొన్నారు. ఆమె చేసేవన్నీ ఆరోపణలు అని పోలీస్ కస్టడీలో తెలిపాడు. తాజాగా జానీ మాస్టర్ బెయిల్ అప్లై చేయగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అవార్డు అందుకోవడానికి జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసారు. ఈనెల 6 నుండి 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి కోర్టు. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్గూడా జైల్లో ఉన్నారు.

Previous హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో "కర్ర సాములో ఉచిత శిక్షణ"
Next పాల్వంచ మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి. సేవాలాల్ సేన
ADVERTISEMENT