| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అచ్చంపేటలో అర్ధరాత్రి ఘర్షణ: బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కు గాయాలు

అచ్చంపేటలో అర్ధరాత్రి ఘర్షణ: బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కు గాయాలు

డైలీ భారత్, నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.

ఈ ఘర్షణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. ఇరు వర్గాల రాళ్లదాడిలో ఆయన గాయపడ్డారు.

బీఆర్ఎస్ శ్రేణులు కారులో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందో ళనకు దిగాయి. డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో ఉప్పునుంతల మండలం వెల్దూర్ గేట్ వద్ద ఓ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఆ తర్వాత అచ్చంపేటలోని అంబేడ్కర్ కూడలిలో కారును అడ్డుకొని రాళ్లతో దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరు కున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొని పరస్పరం రాళ్ల దాడికి దిగారు.

అంతలోనే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. రెండు వర్గాల రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి.

వెంటనే ఆయన ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలించారు.....

Previous దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు.
Next రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనీ సెస్ ఆఫీసులో అగ్నిప్రమాదం
ADVERTISEMENT