| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్!

హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్!

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినవారి గుండెల్లో రైళ్లు పరుగుడెతున్నాయి. 

ఎందుకంటే ఆ నిర్మాణాల ను హైడ్రా కూల్చివేస్తోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిని కూడా వదలడం లేదు. ఆ నిర్మాణాలన్నీ నేలమట్టం చేసి నోటీసులు జారీ చేస్తోంది. అయితే హైడ్రా కాన్సెప్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికోసం ప్రత్యేక పోలీసు లు కూడా కేటాయించారని తెలుస్తోంది. హైడ్రాకు ప్రత్యే క అధికారులు, సిబ్బందిని కూడా కేటాయించారు. సినీనటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత హైడ్రా ఊపు మరింత పెరిగింది. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం పై ప్రతాపం చూపుతోంది. 

శని, ఆదివారాల్లో హైడ్రా చేస్తున్న రచ్చ మూములు గా లేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రాను కొందరు స్వాగతిస్తుంటే మరికొంతమంది మాత్రం తిట్టిపోస్తున్నారు. కేవలం పేదల మీద హైడ్రా జూలం చూపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాదు డబ్బున్న వాళ్లకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారని..కేవలం పేదలను టార్గెట్ చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంతో కష్టపడి పైసా పైసా పోగు చేసిన కట్టుకున్న ఇళ్లను కళ్ల ముందే కూల్చివేస్తామంటే ఎలా ఊరుకుంటామంటూ గగ్గోలు పెడుతున్నారు. 

ఈ నేపథ్యంలోనే హైదరా బాద్ లో ప్రస్తుతం హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చి వేతలు కొనసాగుతున్నా యి.అయితే అమీన్ పూర్ లో ఈమధ్య ఓ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చి  వేశారు. అయితే అది కోర్టు పరిధిలో కేసు పెండింగ్ లోనే ఉంది. 

బాధితులు కూడా ఇదే విషయాన్ని హైడ్రాకు చెప్పారని సమాచారం. కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భవనాన్ని నెలమట్టం చేయడం బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా రంగానాథ్ పై ఫైర్ అయ్యింది. 

కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూల్చివే  స్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే వచ్చే సోమవారం నాడు వ్యక్తిగతం లేదా వర్చువల్ గా కోర్టు ఎదుట హాజరవ్వా లని నోటీసులు జారీ చేసింది. 

మరోవైపు తెలంగాణలో మూసీ నది, చైతన్యపురి పలు ప్రాంతాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తామంటూ మార్కులు పెట్టారు అధికారులు. ఇప్పుడు తమ ఇండ్లన కూలగొడితే ఎక్కడికి వెళ్లాలంటూ కన్నీళ్లు పెట్టు కుంటున్నారు.


#hydra #hyderabad #telangana

Previous షాద్‌నగర్ లో మహిళ మర్డర్
Next ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరు ప్రయాణికులు మృతి
ADVERTISEMENT