| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: కమిషనర్ సుబ్బారాయుడు

తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: కమిషనర్ సుబ్బారాయుడు

డైలీ భారత్, తిరుపతి జిల్లా: పరమ పవిత్ర పుణ్యక్షే త్రమైన తిరుమలలో ఆధ్యాత్మికతకు భంగం కలిగించొద్దని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కోరారు. 

త్వరలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నిత్యం అశేషంగా భక్తులు, ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. తిరుపతి నగరంలో ఏదైనా సంఘటన జరిగితే వెంటనే సంచలనం అవుతుందని, కావున రాజకీయ పార్టీలు, మత సంఘాలు, ప్రజా సమూహాలు అందరూ బాధ్యతగా వ్యవహరించా లన్నారు.

తిరుపతి నగర ప్రాశస్త్యాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాల న్నారు.ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పోలీస్ శాఖకు సహకరించాలి. 

ఆధ్యాత్మికతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షిం చేది లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడవద్దని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు.

నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు చేయాలనుకున్నవారు ముందుగా పోలీస్ వారికి రోడ్ మ్యాప్ ను వివరించా  లన్నారు. పోలీస్ శాఖ నుండి ముందస్తు అను మతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు..


#tiripati #andhra Pradesh

Previous ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్‌లతో సహా పదిమంది విద్యార్థులకు తీవ్రగాయాలు
Next ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనిది- మోతె రాజిరెడ్డి
ADVERTISEMENT