| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజాస్వామ్య దేశంలో న్యాయమే గెలిచింది : భారత జాగృతి కన్వీనర్ ఎండి ముస్తఫా

ప్రజాస్వామ్య దేశంలో న్యాయమే గెలిచింది : భారత జాగృతి కన్వీనర్ ఎండి ముస్తఫా

కవిత బెయిల్ పట్ల హర్షం వ్యక్తం చేసిన భారత జాగృతి కన్వీనర్ ఎండి ముస్తఫా

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగిందనీ ఎండి ముస్తఫా హర్షం ప్రకటించారు. దాదాపుగా 166 రోజుల నుండి తీహార్ జైల్లో ఆధారాలు లేని కేసు విషయంలో జైలు జీవితాన్ని గడపడం జరిగిందని ఈ కేసును కేవలం కక్షపూరితంగానే ఆమెను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయాలని బిజెపి ప్రభుత్వం ఆమెపై కక్షపూరితంగా ఈ కేసును ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను వాడుకొని ఆమెకు ఇబ్బందులను గురి చేయడం జరిగిందన్నారు. కానీ ఈరోజు  భారతదేశ అత్యున్నత న్యాయస్థానం  న్యాయబద్ధమైన తీర్పును వెలువరిస్తూ బెయిల్ మంజూరు చేయడం జరిగిందన్నారు. కల్వకుంట్ల కవితకు  సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల   ఆనందం వ్యక్తం చేస్తూ, అక్రమ కేసులు పెట్టి తెలంగాణ ఆడబిడ్డను ఇబ్బందులకు గురి చేయడం జరిగిందనీ, రాబోయే రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు..

Previous బీజేపీ మైత్రితోనే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
Next నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం
ADVERTISEMENT