కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నాటి వాస్తవాలను గుర్తు చేసిన
భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కూటమిగా ఎన్నికల్లో పోటీ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భవిష్యత్ లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటిగా పోటీ చేసి కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేఎల్ఆర్.
వాళ్ల లిక్కర్ అవినీతిని సమర్థంగా వాధించే సమర్థత ఈడీ, సీబీఐకి బీజేపీ కేంద్ర సర్కారు ఇవ్వలేదన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు కిచ్చెన్నగారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని రాష్ట్రాల ప్రభూత్వాధినేతల అవినీతిపై ఎంక్వయిరీ జరుగుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ అవినీతిలో బీజేపీకి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు కేఎల్ఆర్.