| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మూడున్నర కోట్ల బకాయి కి పాత ఏసీ, పాత స్కూటర్ జప్తు

మూడున్నర కోట్ల బకాయి కి పాత ఏసీ, పాత స్కూటర్ జప్తు

డైలీ భారత్, వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో శివ సాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్ ఖరీఫ్ 2021- 22, రబి 2021-22 లో భాగంగా బకాయిలు చెల్లించక పోవడంతో శనివారం రైస్ మిల్లు యజమాని ఇంటి దగ్గర వస్తువులను జప్తు చెసిన్నట్లు తహసిల్దార్ లక్మీ తెలిపారు. వీరికి గతంలో రెండు సార్లు రూ. 3,57,22,693 చెల్లించ గలరని నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అయినా వారు స్పందించలేదని ఇందులో భాగంగా 23.8.2024 నాటికి ఎటువంటి బకాయిలు చెల్లించక పోవడంతో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం శనివారం పోలీస్ సిబ్బంది సహకారంతో శివ సాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్ యజమానురాలు విజయ భర్త శ్రీ వెంకటరామిరెడ్డి జనుంపల్లి గ్రామం ఇంటికి వెళ్లి వారి ఇంట్లో వస్తు సామాగ్రిని జప్తు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్ర, నాయబ్ తహసీల్దార్, కార్యదర్శులు, జూనియర్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous ఎన్‌ కన్వెన్షన్‌ అద్దె రూ.5 లక్షల నుంచి ప్రారంభం
Next జూలూరుపాడు లో మాలల ఆత్మీయ సమ్మేళనం.
ADVERTISEMENT