| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్యారడైజ్ హోటల్లో మంటలు

ప్యారడైజ్ హోటల్లో మంటలు

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో మంటలు  

డైలీ భారత్, హైదరాబాద్: నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురై తినే ప్లేట్లను వదిలి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు." ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఎవరూ గాయపడలేదు. కిచెన్ నుంచి భారీ ఎత్తున మంటలు రావటం చూసిన పని వారు, కస్టమర్లు వెంటనే అప్రమత్తం అయ్యి.. బయటకు పరుగులు తీశారు. సిబ్బంది సైతం సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది.

హోటల్ కిచెన్లో షార్ట్ సర్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కస్టమర్లకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో హోటల్ సిబ్బందితో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలి : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
Next కేటీఆర్ చేసే ఆరోపణలు కోడి గుడ్డు మీద ఈకలు పీకడం లాంటివి : పామేన భీమ్ భారత్
ADVERTISEMENT