| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళ గొంతు కోసి దారుణ హత్య

మహిళ గొంతు కోసి దారుణ హత్య

డైలీ భారత్, బరేలీ: ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ హోటల్ ప్రీత్ ప్యాలెస్‌లో 28 ఏళ్ల యువతి రక్తంతో తడిసిపోయి కనిపించింది.

మహ్మద్ ఆలం అనే వ్యక్తి ఐడీని ఉపయోగించి బుక్ చేసిన హోటల్ గదిలో మహిళ శవమై కనిపించింది. ప్రస్తుతం ఈ వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ గొంతు కోసి దారుణంగా హతమార్చారు. బట్టలు చిందరవందరగా ఉన్నాయి. మృతదేహం దగ్గర విడివిడిగా బురఖా పడి ఉండడంతో ఆ మహిళ ముస్లిం అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మహిళ మృతదేహాన్ని పోర్ట్‌మార్టం కోసం పంపినట్లు బరేలీ పోలీసులు తెలిపారు. మహిళ హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అసలు రూమ్ బుక్ చేసిన మహ్మద్ ఆలం అనే వ్యక్తి ఎవరు? చనిపోయిన మహిళకు, అతడికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఎవరు ఆమెను అంత కిరాతకంగా హత్య చేశారు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Previous సిఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కని కలిసిన ఎమ్మెల్సీలు
Next శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం
ADVERTISEMENT