మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
డైలీ భారత్, మహబూబాబాద్: ఈరోజు ఉదయం 8 గంటలకు డోర్నకల్ సీఐ ఎస్ఐ మరియు వారి సిబ్బంది R. సైదులు pc.2536, s. సూర్యనారాయణ HC.2227 లతో బాబు జగజీవన్ రాం బొమ్మ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనం పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసు వారు దాన్ని పట్టుకుని వారిని విచారించగా వారి యొక్క వాహనంలో రెండు మోటార్లు మరియు రెండు స్కూటీలు కలిగి ఉండగా తదుపరి విచారణలో వారు గత నాలుగు నెలల నుండి వివిధ ప్రాంతాలలో కరెంట్ మోటార్ లు, ఇనుప వస్తువులు దొంగతనాలు చేస్తున్నట్లు తెలుపగా పోలీసు వారు వారి వద్ద నుండి ముందుగా 2 మోటర్ లు,2 స్కూటీ బైక్ లు,అశోక్ లెలాండ్ ట్రాలీ ,70000 /-నగదు ను స్వాదినపర్చుకుని తర్వాత నిందితుడు A5) తేజవత్ జవహర్లాల్ ఇంటి వద్ద ఇంటివద్ద 17 మోటార్ల మొత్తం 19 మోటార్ లు స్వాధీనపరుచుకున్నారు.
నిందితుల వివరాలు
1) వీరబోయిన ముత్యాలు D/0 ఆఫ్ సాంబయ్య ,వయసు 36 సంవత్సరాలు, కులం ముదిరాజ్ వృత్తి, పాత ఇనుము వ్యాపారం హౌస్ నెంబర్ 10-6-63/16 చెరువు కట్ట బజార్ మామిళ్లగూడెం ఖమ్మం.
2) కొట్టే గణేష్ S/0 శ్రీనివాస్ , 21yrs, మున్నూరు కాపు, బొలెరో డ్రైవర్,R/o మామిళ్లగూడెం ఖమ్మం.
3)తేజావత్ సదర్ లాల్ S/0 బద్య ,35yrs, సూతరి పని R/o మామిళ్లగూడెం ఖమ్మం.
4)మొగిలి నాగరాజు S/0 వీరభద్రం age.20yrs,R/0 వేపకుంట్ల(V) రఘునాధపాలెం (M),
5) ఇస్లావత్ సిద్ధూ S/0 రవి,age20yrs,R/0అన్నారం తండా H/0 గానుగపాడు విలేజ్ చంద్రుగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
6) తేజావత్ జోహార్ లాల్ S/0g బద్య,38yrs, sentring work R/0 పువ్వాడ ఉదయం నగర్ కాలనీ(V),రఘునాథపాలెం మండలం,ఖమ్మం జిల్లా. వీరి లో మొగిలి నాగరాజు పై ఖమ్మం 3 టౌన్ పిఎస్ లో కేసు నమోదైనది, తేజవత్ సోదరులాల్ పై కొనిజర్ల పిఎస్ లో కేసు నమోదు ఉన్నది, వీరబోయిన ముత్యాలు పై ఖమ్మం రూరల్ పిఎస్ లో ఒక కేసు నమోదు అయినది.
పరారిలో ఉన్న నిందితులు
7) శ్రీను & వెంకటేష్ R/o
8) శివ R/O కొత్తగూడెం
9)(JCL-1)
10)(JCL-2)
స్వాధీనపరచుకున్న సొత్తు వివరాలు
1). 19 బావి ఎలక్ట్రిక్ మోటార్లు
2).TS 04 UD 7897 అశోక్ లేలాండ్ ట్రాలీ
3).నెంబర్ లేని స్కూటీ,chassis No.ME4JF98FFRW010187.
4)TS 04 FA 8726
5)70,000/- నగదు
పైన తెలుపబడిన నిందితులు సులువుగా డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఒక గ్యాంగ్ గా తయారై గత 4 నెలల నుండి మెహబూబాబాద్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా నందు మొత్తం 19 మోటర్లు దొంగలించినారు మరియు టన్నున్నర ఐరన్ రాడ్లను కూడాదొంగతనం చేసినారు.
ప్రధాన నిందితురాలు ముత్యాలు మోటారు దొంగతనం చేయాలని తన స్నేహితురాలైన నాగలక్ష్మి యొక్క అశోక్ లేలాండ్ ట్రాలీ వెహికల్ ను కిరాయికి తీసుకొని
పైన నిందితులతో కలిసి మొత్తం 19 మోటార్లను దొంగలించినారు. అటు మోటార్లనుఖమ్మం పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తేజవత జవహర్లాల్ ఇంటి వద్ద దాచి ఉంచి, 10 రోజుల క్రితం దొంగలిన్చ్చిన మోటర్లను ఆరోజు ఎవరో వెంటపడుతున్నట్లు అనిపించి డోర్నకల్ మండలం లోని సమ్మక్క సారక్క దేవాలయం పక్కన చెట్ల కుదరలో దాచిపెట్టి ఈరోజు వాటిని తీసుకొని వెళ్ళుటకు రాగా పోలీసు వారు పట్టుకున్నారు. అని నిందితులు తెలిపినారు,
నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు.
మహబూబాబాద్ జిల్లాలో
1. డోర్నకల్ మండలంలో మొత్తం ఏడు మోటర్లు టన్నున్నర ఇనుప రాడ్లు
2. కురివి మండలం రెండు మోటర్లు.
3. Narsimhulupet మండలంలో ఒక మోటర్.
ఖమ్మం జిల్లా నుండి
4. రఘునాథపాలెం మండలంలో ఐదు మోటార్లు
5. చింతకాని మండలంలో రెండు మోటార్లు
6. తల్లాడ మండలంలో ఒక మోటారు
7. ఖమ్మం రూరల్ పరిధిలో ఒక మోటారు.
దొంగలించినారు. వీటి మొత్తం విలువ అందజా 4,54,000/-ఉన్నది