| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గ్రామదేవతల ప్రతిష్టాపనతో సుఖశాంతులు : ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి

గ్రామదేవతల ప్రతిష్టాపనతో సుఖశాంతులు : ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి

కొత్తూరులో అష్ట ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

హాజరైన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గ్రామదేవతల ప్రతిస్టాపనతో కొత్తూరు మున్సిపాలిటీ సుఖ శాంతులు పెంపొందితాయని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి  అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అష్ట ఆలయాల విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ ప్రజలు గ్రామ దేవతల కరుణ కటాక్షం ప్రజలందరికీ ఉండాలని ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సకల సంపదలతో విరజిల్లాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సదానందం గౌడ్,కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ చైర్ పర్సన్ బాతుకు లావణ్య దేవేందర్ యాదవ్,కొందుటి నరేందర్,మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, కౌన్సిలర్స్ మాదారం నరసింహ గౌడ్,సోమ్లా నాయక్,గణేష్ గౌడ్,మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,సాయి చారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Previous రైతు రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పూర్తి చేశారు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next నటుడు మోహన్ లాల్ కు అస్వస్థత....ఆస్పత్రికి తరలింపు
ADVERTISEMENT