| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మకు పాడెకట్టి శవయాత్ర చేసిన రైతులు

సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మకు పాడెకట్టి శవయాత్ర  చేసిన రైతులు

డైలీ భారత్ ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీపై  రైతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రుణాలు మాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. మూడో విడుతలోనూ తమకు బాంకు లోన్లు మాఫీ కాకపోవడంతో ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండల కేంద్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మకు పాడెకట్టి శవయాత్ర నిర్వహించారు. ఓ రైతు ముందు నడుస్తుండగా డప్పు చప్పుళ్లు, వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి పాడెను తలమడుగులో ఊరేగించారు. ఈ శవయాత్రలో సుమారు 500 మంది రైతులు పాల్గొన్నారు.

Previous దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
Next మరో యువతితో భార్యకు రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన రాజకీయ నాయకుడి అనుచరుడు
ADVERTISEMENT