| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుటుంబం ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

కుటుంబం ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

వనస్థలిపురం లో భారీ వర్షం, 

నాలా లోకి దూసుకెళ్లిన కారు,

సకాలంలో సమయ స్ఫూర్తితో వ్యవహరించి, ముగ్గురు చిన్నారుల తో సహా కుటుంబము ప్రాణాలను కాపాడిన వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు.

డైలీ భారత్, హైదరాబాద్: హయత్ నగర్  కు చెందిన జిల్లా వినోద్ తన భార్య పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఎల్బీనగర్ వైపుకు జోరు వాన లో కారులో వెళ్తుండగా, వనస్థలిపురం పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉధృతి కి కారు అదుపు తప్పి పక్కన ఉన్న వర్షపు నీటి నాలా లోకి దూసుకొని వెళ్లగా, అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ సి.ఐ వెంకటేశ్వర్లు , కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు గమనించి సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆపద్బంధువుల లాగా కారులో ఉన్న ముగ్గురు చిన్నారుల తో సహా కుటుంబము మొత్తాన్ని సురక్షితంగా కాపాడినారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బందిని పై అధికారులు అభినందించి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిబ్బందికి తగిన సూచనలు చేసినారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన తర్వాత ట్రాఫిక్ సి.ఐ. లు వెంకటేశ్వర్లు మరియు శ్రీనివాస్ రెడ్డిలు భారీ క్రేన్ సహాయంతో నాలాలో ఇరుక్కొన్న కారును కూడా బయటకు తీయించినారు.

Previous పెద్దూరు పాఠశాలకు గ్లాస్ టేబుల్ : టేకు రమేష్
Next దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్య సేవలు!
ADVERTISEMENT