| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

గూడూరులో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలంలోని గూడూర్ పరిధిలోని పెద్దగుట్ట తండాకు చెందిన మూడవత్ బుజ్జి రాము నాయక్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి,కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతనంగా నిర్మించిన ఇంటిలో మూడవత్ బుజ్జి రాములు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అందుకు భగవంతుడు అన్ని విధాలుగా దీవించి ఆశీర్వ దించాలని  వేడుకొన్నారు.

ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారి గూడూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని స్థానిక బిఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. పార్టీలో కార్యకర్తలు అంతా సైనికులలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గూడూరు మాజీ సర్పంచ్ సత్తయ్య,మక్తగూడ మాజీ సర్పంచ్ రాజు,మాజీ ఉపసర్పంచ్ నరసింహారెడ్డి,మాజీ ఎంపిటిసి రాధా లక్ష్మణ్,గూడూరు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సురేష్,మాజీ వార్డ్ మెంబెర్స్,మాజీ వార్డ్ నెంబర్ రాజు గౌడ్,మాజీ విలేజ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్,మాజీ వార్డ్ నెంబర్ మైలారం రవి, మాజీ వార్డ్ నెంబర్ ఎలుగని రాములు,సుధాకర్ రెడ్డి,వాజిద్ అలీ,జయేందర్ రెడ్డి, నరసింహారెడ్డి,సుధాకర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Next శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కేఎల్ఆర్
ADVERTISEMENT