| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ మంత్రి డాక్టర్ పి శంకర్ రావును కలిసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మాజీ మంత్రి డాక్టర్ పి శంకర్ రావును కలిసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మాజీ మంత్రి డాక్టర్ పి శంకర్ రావును షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలిసారు. బుధవారం హైదరాబాద్ లోని మాజీ మంత్రి శంకర్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడంతోపాటు స్వీటు అందజేశారు. శంకర్ రావు ఆరోగ్య పరిస్థితుల గురించి, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. శంకర్ రావు షాద్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమకు ఎంతో ప్రోత్సాహం అందించాలని, వారి ప్రోత్బలంతోనే తాను ఈరోజు రాజకీయాల్లో నిలవడం జరిగిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే మాజీ మంత్రి శంకర్ రావుదే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి ,బాబర్ ఖాన్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Previous హిందూ ధర్మాన్ని విచ్చినం చేస్తున్న కమ్యూనిస్టులు
Next ఆంజనేయస్వామి దేవాలయం ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ADVERTISEMENT