నిందితున్ని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా లో పోస్టు లు చేస్తున్న వ్యక్తి.తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ మాట్లాడిన వీడియో లను సేకరించి, స్పీకర్ పై అనుచిత వాఖ్యలు చేసి, కించపరిచే విధంగా పోస్టు లు చేసి సోషల్ మీడియా లో వైరల్.
ఈ విషయంపై గతంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన అసెంబ్లీ కార్యదర్శి.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు..
వికారాబాద్ మోమిన్ పేట కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.విజయ్ కుమార్ ను ఈ పోస్టులు పెట్టాలని చెప్పి, వాటిని వైరల్ చేయాలన్న కీలక సూత్రదారులు ఎవరన్న విషయాలను తెలుసుకుంటున్న సైబర్ పోలీసులు.ఈ కేసులో మరి కొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం.