డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలంలోని చిలకమర్రి గ్రామ పర్యటనలో భాగంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిలకమర్రి గ్రామానికి చెందిన ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. చెక్కు అందుకున్న వారిలో సిహెచ్ భీమయ్య 19,500, కె వీరయ్య 60,000, సిహెచ్. సాయి సందీప్ 60,000, సిహెచ్ నవనీత 17,000, వీరయ్య 60,000 అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం, మాజీ ఎంపిటిసి అరుణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జి. బాలరాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు..
News
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్