కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పని నిరుద్యోగుల సెగ...
రాష్ట్రవ్యాప్తంగా పలు విధ్యార్థి సంఘనాయకులు, నిరుద్యోగ సంఘ నాయకుల అరెస్టులు
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో వివిధ ఆర్గనైజేషన్ల నాయకులను నిన్న అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు చేపట్టారు. దీనికి పలు సంఘాలు ఘాటుగా స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు.ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడమే కాకుండా ఈరోజు ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, విధ్యార్థి నాయకులు కలిసి ప్రశ్నించడానికి వెళుతుంటే యావత్ తెలంగాణ నలుమూలల అక్రమ అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు నిరుద్యోగులు విధ్యార్థి నాయకులన్న ఎందుకు ఇంత భయం? మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన, ఎంతమందిని జైల్లో పెట్టిన వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు. ఇక నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వణుకు పుట్టేలా ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు.