| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్ల స్టాఫ్ సెక్రటరీగా కుమ్మరి మల్లేశం

 కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్ల స్టాఫ్ సెక్రటరీగా కుమ్మరి మల్లేశం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో స్టాఫ్ సెక్రటరీగా ఉన్న మల్లారపు పురుషోత్తం ఉద్యోగ విరమణ పొందినందున నూతన స్టాఫ్ సెక్రటరీగా ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు కుమ్మరి మల్లేశంను ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ మరియు ఉపాధ్యాయ బృందం కుమ్మరి మల్లేశం ను ప్రత్యేకంగా అభినందించి,శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు మధ్య వారధిగా పని చేస్తానని, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన స్టాఫ్ సెక్రటరీ మల్లేశం అన్నారు. 

ఈ కార్యక్రమంలో దాసరి రవీందర్ పాతూరి మహేందర్ రెడ్డి బొమ్మ వరం గోవిందరావు పాకాల శంకర్ గౌడ్ దేవత ప్రభాకర్ హజు నాయక్ శ్రీహరి ఫాతిమా సంధ్యారాణి సరిత మంజులత సాంబయ్య సమ్మయ్య నసీరుద్దీన్ లక్ష్మీనారాయణ రాములు వెంకటేశం లింగమూర్తి మొదలైన వారు పాల్గొన్నారు

Previous ఆరు నెలల్లో కళాశాల రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ADVERTISEMENT