| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారీ పేలుడు.. ఆరుగురు మృతి

భారీ పేలుడు.. ఆరుగురు మృతి

డైలీ భారత్, షాద్ నగర్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని బూర్గులలో ఉన్న సౌత్ గ్లాసు కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. కంప్రెషర్ పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Previous కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
Next సౌత్ గ్లాస్ పరిశ్రమలో మృత్యువాత పడ్డది వీరే
ADVERTISEMENT