| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గొప్ప సంస్కరణల శీలి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

గొప్ప సంస్కరణల శీలి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు :  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చేగూరులో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి, ఎంపీపీ ప్రియాంక గౌడ్ తో కలిసి మీడియా సమావేశం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం పీవీ చరిత్ర నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. పీవీ నరసింహా రావు గొప్ప సంస్కరణల శీలి అని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. నందిగామ మండలం చేగూరులో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి, ఎంపీపీ ప్రియాంక గౌడ్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పివి జయంతి నేపథ్యంలో ఆయన చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ తరఫున కొనియాడుతూ నివాళులు అర్పించారు. ప్రధానమంత్రిగా ఇతర మంత్రిత్వ శాఖలను నిర్వహించిన పీవీ నరసింహారావు అనేక సంస్కరణలు చేశారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం పూర్తికాలం సమర్థవంతంగా నడిపారన్నారు. పీవీ గొప్పతనాన్ని గుర్తించి భారత రత్న ప్రకటించారని తెలిపారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా పీవీ నరసింహారావు ఎన్నో విభాగాల్లో పనిచేసి భారతదేశ కీర్తిని ప్రజలకు చాటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జంగా నరసింహ యాదవ్, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

Previous బ్రీత్అన‌లైజర్‌తో మందుబాబు పరారీ
Next విశాల్ మార్ట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్
ADVERTISEMENT