పేలుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : ఏసిపి రంగస్వామి
వెంచర్లో బ్లాస్టింగ్ సంఘటనపై ఏసీపీని కలిసిన టిడిపి, బిజెపి నేతలు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణ శివారులోని సిరిసంపద టౌన్షిప్ ప్రాంతంలో వెంచర్ ఏర్పాటు కోసం చేస్తున్న పనుల నిమిత్తం జరుగుతున్న బ్లాస్టింగ్ శబ్దాల వల్ల స్థానిక ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా అక్కడ ఆధ్యాత్మిక చిహ్నాలను రూపుమాపుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య ,చెట్ల వెంకటేష్ తదితరులు పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు.
గురువారం స్థానిక ఏసిపి రంగస్వామిని పలువురు నాయకులు కలుసుకొని వెంచర్ పనుల నిర్వాకంపై కలిసి వినతి పత్రం సమర్పించారు. జనావాసాల మధ్య నిత్యం రణ గొణ ధ్వనులతో శబ్ద కాలుష్యం మరియు ఇళ్లలో వస్తున్న పగుళ్లు, బాలాజీ టౌన్షిప్ కాలనీలో రాళ్లుపడుతున్న సంఘటనలను ఏసీబీ దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా వెంచర్ అక్రమాలపై కూడా ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏసీబీ రంగస్వామి వారితో మాట్లాడుతూ బ్లాస్టింగ్ విషయంలో ఏమైనా ఆక్షపనలు ఉంటే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించినట్టు చెప్పారు. అదేవిధంగా ఈనెల 30 వరకు బ్లాస్టింగ్ కోసం అనుమతులు ఉన్నాయని తదుపరి ఇచ్చే అనుమతి విషయంలో ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏసిపి పేర్కొన్నారు..