| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బ్యాటరీ ఆటో రిక్షాలను ప్రారంభించిన జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ

బ్యాటరీ ఆటో రిక్షాలను ప్రారంభించిన జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ

కొత్త బ్యాటరీ రిక్షా పొగ నుండి స్వేచ్ఛను అందిస్తుంది - సరితమ్మ

మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్...

డైలీ భారత్, జోగుళాంబ గద్వాల: భారతీయ నగరాల్లో తమ ఉనికిని చాటుకోవడం ప్రారంభించిన బ్యాటరీతో నడిచే ఆటో రిక్షాలు, సౌరశక్తి ద్వారా బ్యాటరీలను శక్తివంతం చేయడం ద్వారా భారతదేశం  మరో అడుగు ముందుకేసిందని  జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ అన్నారు.. గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఏఐటియూసి కార్మిక సంఘ నాయకుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆటో రిక్షాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ పట్టణ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ చేతులమీదుగా రిబ్బన్ కటింగ్ చేసి,జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.... అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ రహదారులపై ఈ-రిక్షాలు కాలుష్యాన్ని తగ్గించగలవన్నారు...దేశవ్యాప్తంగా నగరాల్లో కాలుష్యం యొక్క ప్రమాదకర స్థాయిలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, బ్యాటరీతో పనిచేసే ఇ-రిక్షాలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చాని, చట్టపరమైన ఆమోదం పొందిన ప్రధాన నగరాలలో ఈ వాహనాలను ఇప్పటికే ఉపయోగంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు,లత్తిపురం వెంకట్రామిరెడ్డి,మహ్మద్ ఇసాక్, నరహరి గౌడ్,టి.శ్రీనివాసులు, పులిపాటి వెంకటేష్, ఎల్లప్ప, నాగేంద్ర యాదవ్,డిటిడిసి నర్సింహులు, కొటేష్,నాగ శంకర్, రంజిత్ కుమార్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ,సిపిఐ, ఏఐటియూసి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous చిన్నారికి నామకరణం చేసిన సీఎం చంద్రబాబు
Next దని ఫైనాన్స్ పేరుతో టోకరా : సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ బి.రఘుపతి
ADVERTISEMENT