డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అక్రిడేటెడ్ జర్నలిస్టులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు అందించింది. అక్రిడేటెడ్ జర్నలిస్టుల బస్ పాస్ గడువు పొడిగించింది.
తెలంగాణ రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీ ఎస్‌ఆర్టీసీ పొడిగించింది.
ప్రస్తుత బస్ పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబం ధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు బస్ పాస్‌ల గడువును మూడు నెలల పాటు టీజీఎస్ ఆర్టీసీ పొడిగించింది. అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.