| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఒకే విడతలో రైతు రుణమాఫీ చారిత్రాత్మకం.. : మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

ఒకే విడతలో రైతు రుణమాఫీ చారిత్రాత్మకం.. : మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

మాటిస్తే.. నెరవేరుస్తాం..

రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే రేవంత్ అన్న తపన..

రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయానికి ధన్యవాదాలు..

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల సంక్షేమం..

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మాటిస్తే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని, ఒకే విడతలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఒకే విడతలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తూ రాష్ట్ర క్యాబినెట్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్జి  మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని అనాదిగా రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. తెలంగాణలో ముఖ్యమైన జల ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ హాయంలోనే నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి పంటకు నీరందించాలని, ప్రతి చేనును తడపాలని రైతులను ఆర్థికంగా స్థితిమంతులను చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తూ నూతన ప్రాజెక్టులకు సైతం శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. 

వ్యవసాయానికి పునర్వైభవం తీసుకువచ్చి రైతుల కళ్ళలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపన అన్నారు. అందులో భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే దఫాలో చేయడంతో రైతులంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ తో పాటు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. రైతులకు అండగా నిలబడుతూ ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర క్యాబినెట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..

Previous మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి
Next ఉపాధ్యాయ సమస్యలపై ముఖ్యమంత్రి ని కలిసి విజ్ఞాపన పత్రం అందించిన టి టి యు రాష్ట్ర అధ్యక్షులు మునగాల మహిపాల్ రెడ్డి
ADVERTISEMENT