| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నీట్ లీకేజీ పై సిబిఐ విచారణ జరగాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నీట్ లీకేజీ పై సిబిఐ విచారణ జరగాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం*

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నీట్ యూజీ పరీక్షా పత్రం లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరపాలని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్ నగర్ ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీ ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఇది మాయని మచ్చ అని మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే అన్నారు. ఇద్దరు నిందితులు నితీష్ కుమార్ మరియు అమిత్ ఆనంద్ నీట్ బిపిఎస్సి మరియు యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసే ముఠాలో భాగస్వాములని ఆరోపించారు. బీహార్ లోని దానాపూర్ టౌన్ కౌన్సిల్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సికందర్ ప్రసాద్ యాదవేందు తమను సంప్రదించినట్టు నితీష్ మరియు ఆనంద్ ఒప్పుకున్నారని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల కోసం యాదవెందు నుంచి నితీష్ ఆనంద్ 32 లక్షలు వసూలు చేశారని విమర్శించారు. మే 4న పరీక్షకు ఒక రోజు ముందు నలుగురు అభ్యర్థులను గెస్ట్ హౌస్ కు పిలిపించి అక్కడ ప్రశ్న పత్రాన్ని సిద్ధం చేయడంలో నితీష్ మరియు ఆనంద్ సాయం చేశారని మే ఐదవ తేదీన జరిగిన అసలు పరీక్షలను ఇవే ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులకు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలలో పేర్కొన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందని ఈ పరీక్షలో అవతవకలు జరిగినట్టు ఎన్టిఏ కి సమాచారం రావడంతో దీన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,205 సెంటర్లో జరిగిన యుజిసి నెట్ పరీక్షకు దాదాపు తొమ్మిది లక్షల మంది పైగా అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష తీవ్రదుమారం రేపుతోందని అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటిదాకా ప్రాథమిక ఆధారాలను గుర్తించారని తెలిపారు. ఇదివరకే ప్రశ్నాపత్రం లిక్ కేసులో నలుగురు అభ్యర్థులతో సహా ఏడుగురిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారని ఇండియా టుడే టీవీ అన్ని నిందితుల వాంగ్మూలాలను లేఖలను ప్రచురించిందని లీగైన ప్రశ్నాపత్రాలను అందించడానికి ముఠా 32 లక్షలు వసూలు చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు. బాధ్యత గల ప్రభుత్వం ఇలాంటి ప్రశ్న పత్రాలు లీకేజీలు నిర్లక్ష్యం వహించకూడదని వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.


ఈ మీడియా సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ అందేమోహన్ ముబారక్ హరినాథ్ రెడ్డి ఖదీర్ తదితరులు పాల్గొన్నారు..

Previous అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచింది యోగా : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next ఏసీబీ వలలో తహశీల్దార్‌ కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
ADVERTISEMENT