| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

షాద్ నగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు

మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ మైనార్టీ నేతల అలయ్ బలయ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ సందర్భంగా షాద్ నగర్ బీఆర్ఎస్ నేత, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. 

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు స్వయంగా తెలిపారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఎజాజ్ (అడ్డు), పల్లె శ్రీనివాస్ రెడ్డి, సుధీర్, చీపిరి రవి యాదవ్ తదితరులు ఎమ్మెల్సీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దైవాజ్ఞను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని అన్నారు. ఇంత పేదవాడైన తోటి సోదరుడికి పేదవాడికి తప్పకుండా తనకు కలిగినంతలో దానం చేస్తాడని మానవతా దృక్పథంతో ఆదుకుంటాడని తెలిపారు. సమాజంలో దైవభక్తి ఒక్కటే ప్రశాంతతను కలిగిస్తుందని మిగతా ఏ విషయాలు ఆధ్యాత్మికత ముందు చిన్నవేనని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించాలని అప్పుడే సమాజంలో శాంతి సామరస్యాలు ఉంటాయన్నారు. టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలందరికీ ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు..

Previous పోతనపల్లి గ్రామంలో ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలు
Next యారన్ సబ్సిడీని తగ్గించి కార్మికులకు నష్టం చేయొద్దు : కోడం రమణ సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు
ADVERTISEMENT