సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 2.5లక్షలు అందజేత
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:అనారోగ్యాల బారిన సామాన్య ప్రజలు, పేదలు పడినప్పుడు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలం మొదళ్ల గూడ గ్రామ పంచాయతీలో మసీద్ మామిడిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కృషి చేసినందుకు బాధితులు గ్రామస్తులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా రెండు లక్షల 50 వేల రూపాయల చెక్కును బాధితుడు అందుకున్నారు. మరియు మసీద్ మామిడిపల్లి గ్రామానికి చెందిన ఏ. సుధాకర్ 2.50.000 సీఎం పండు కింద రిలీజ్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెక్కును రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, నవీన్ గౌడ్, సుదర్శన్, జంగయ్య, నరసింహులు, నవీన్, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు..