| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇష్టపడి చదవండి మంచి భవిష్యత్తు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఇష్టపడి చదవండి మంచి భవిష్యత్తు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

విద్య పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

బడిబాటలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంతాలలోనీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని సమాజంలో తలెత్తుకొని బ్రతకగలుగుతానని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాలలో బడుబాట కార్యక్రమంలో జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డితో కలిసి  సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా విద్యాలయాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గతంలో మేము చదువుకునేటప్పుడు ఎలాంటి వసతులు లేనప్పటికీ కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకునే వాళ్ళమని నేడు ప్రభుత్వం పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలలో కొన్ని పాఠశాలలో పదవ తరగతిలో జీరో రిజల్ట్ రావడం సరికాదన్నారు.పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే ఒక్క ప్రభుత్వంతోనే కాకుండా అధికారులు, రాజకీయ నాయకుల తోడ్పాటు ఎంతో అవసరం అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో అటెండర్, చప్రాసి పనులు నిర్వహిస్తున్న వారు ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందలేదని,సంవత్సరాల తరబడి పాఠశాలల అభివృద్ధి కోసం పనిచేస్తున్న వారి సమస్యల పైన అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. కొత్తపేట గ్రామ పాఠశాలల అభివృద్ధి కోసం గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ కుటుంబం ఎంతో కృషి చేసిందని తెలిపారు.మీరు నచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నందున పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి, ఎంపీటీసీ పసుల మల్లేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లూరు జగదీశ్వర్, మహిళా అధ్యక్షురాలు అనసూయమ్మ,నాయకులు శ్రీధర్ రెడ్డి సురేష్ రెడ్డి, అంజయ్య విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు

Previous ఉప ముఖ్య‌మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చింది కసాయి తల్లి
ADVERTISEMENT