పల్లె పల్లె కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో సరితమ్మ...
- గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ..
డైలీ భారత్, గద్వాల: గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని పార్చర్ల, సోంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ పల్లె పల్లె ప్రచార కార్యక్రమంలో భాగంగా అభ్యర్థి సరితమ్మ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి తో కలిసి ప్రచారం నిర్వహించారు.....ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ రాకతో మహిళలు పార్చర్ల, సోంపురం గ్రామ మహిళలు,ప్రజలు పరవశించి స్వాగతం పలికారు....అనంతరం సరితమ్మ మాట్లాడుతూ గత పాలకుల పుణ్యమా గద్వాల నియోజకవర్గంలో బహుజన బిడ్డలు నిరక్షరాస్యులై,నిరుద్యోగ యువతగా మారడంతో బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు..
గద్వాల మార్పు కోసమై బహుజన బిడ్డగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వాదించాలని సరితమ్మ కోరారు..ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేతులు రాని ఒకే కుటుంబ నాయకుల పరిపాలనతోనే గ్రామాల అభివృద్ధి చెందాలేదాని,రోడ్లు, పాఠశాల, మౌలిక సదుపాయాలు లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తానని సరితమ్మ హామీ ఇచ్చారు...కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం..ప్రతీ ఇంటా సౌభాగ్యం.. కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని సరితమ్మ అన్నారు..వృద్దులకు,వితంతువులకు,వికలాంగులకు, చేనేత,కల్లుగీత కార్మికులకు చేయూతగా 4 వేల రూపాయలు, రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు,రైతు బంధు క్రింద ఏటా ఎకరానికి 15 వేలు,కౌలు రైతులకు 12 వేల రూపాయలు,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తామన్నారు..బడుగు బలహీన వర్గాల మీ బిడ్డగా మీ ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు...
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి చంద్రశేఖర్ రెడ్డి,లత్తిపురం వెంకట్రామిరెడ్డి,మాజీ జెడ్పిటిసి కర్రెన్న,శ్రీకాంత్ రెడ్డి,ఆనంద్ గౌడ్, ధరూర్ బోయ శ్రీను, పార్చర్ల కిందిగెరు ఆంజనేయ, రాముడు, దర్శల్లీ,అంజి,ద్యావరి తిమ్మప్ప,లద్దల సవారన్న, ద్యావరి రాజు,ఎద్దుల ఆంజనేయులు,సోంపురం తిమ్మప్ప,ఆంజనేయులు, సవారన్న,మలకంటి,కృష్ణ, మనోజ్,ధరూర్ ఉప సర్పంచ్ సవారన్న, ఎంటికల హన్మంతు, నాగన్న, బోయ వెంకటేష్,రంగస్వామి గౌడ్ తదితరులు ఉన్నారు