| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం ఇంటి ముందు గురుకుల టిచర్ ఆభ్యర్తుల నిరసన

సీఎం ఇంటి ముందు గురుకుల టిచర్ ఆభ్యర్తుల నిరసన

డైలీ భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

Previous ముళ్ల పొదల్లో భారీగా గంజాయి సంచులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Next టోల్ అడిగారని టోల్ గేట్‌నే లేపేశాడు
ADVERTISEMENT