| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత !

 కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత !

స్పందించిన ఎంపీ బండి సంజయ్ కుమార్

పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్‌లో పరిస్థితి అదుపుతప్పింది. నిన్న (26-5-2024) హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న హనుమాన్ ఆలయం నుంచి, గాంధీ రోడ్డు లోని హనుమాన్ ఆలయం వరకు.. ఈ శోభయాత్ర జరపాలని ప్రారంభించారు. హనుమాన్ మాల వేసిన వారు ర్యాలీ చేస్తుండగా.. కొందరు వ్యక్తులు వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళన చేశారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు కరీంనగర్ వైపు చూసే పరిస్థితి. అక్కడ జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి. హనుమాన్ శోభాయాత్రలో తోపులాటతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బండి సంజయ్ స్పందించారు.

కరీంనగర్లో పోలీసుల అత్యుత్సాహం..

హనుమాన్ మాలధారణ లో ఉన్న వ్యక్తిని వందల అడుగులు లాక్కెళ్ళిన వైనం..

ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో శోభాయాత్ర విషయంలో గొడవ జరగడంతో హనుమాన్ మాలదారులను అరెస్టు చేసిన పోలీసులు..నిరసనకు దిగిన హనుమాన్ మాలదారులు.. మద్దతుగా వెళ్లిన బిజెపి నాయకులు పరిస్థితి ఉద్రిక్తం

Previous పరామర్శ...
Next 50 కేజీల బియ్యం వితరణ
ADVERTISEMENT