డైలీ భారత్,ఛత్తిస్ ఘడ్ : ఛత్తిస్ ఘడ్ లోని బేమెతర జిల్లా లో గన్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి 17 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
పేలుడు దాటికి భవనం కుప్పకూలిపోయింది. చావుబతుకుల్లో చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా యంత్రాంగం అంత సంఘటన స్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు.
ఆ ప్రాంతం అంతా గాయపడిన వారి అర్థనాదాలతో హృదయ విధారకరంగా వుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.