షాద్ నగర్ అభివృద్ది నా బాధ్యత :సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గ బాధ్యత తనదేనని నియోజక వర్గ అభివృద్ధి కోసం దశల వారీగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేకంగా కలుసుకున్నారు. నియోజక వర్గానికి చెందిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఆయనతో మాట్లాడారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళిక చర్యలు ఇతర విషయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకోవడం ఆనందంగా ఉందని నియోజకవర్గ అభివృద్ధి కోసం తనతో ఆయన మాట్లాడారని వీర్లపల్లి శంకర్ చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధిలో తన మార్క్ ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు..