| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా  : ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు బుదవారం అరెస్టు చేశారు. 

ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

ఇస్నాపూర్‌ లోకేషన్ గుర్తిం చిన మాచర్ల పోలీసులు.. పటాన్‌చెరు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగారు. పోలీసులు ఆయన్ను ఏపీకి తరలించ నున్నారు.

మే 13న మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి.. ఆగ్రహంతో అక్కడున్న ఈవీఎంను ధ్వంసం చేశారు. ఆ వీడియో ఏపీలో సంచలనం రేపింది. 

వీడియో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి చేరడంతో.. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు పిన్నెల్లి కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు. 

పిన్నెల్లి సోదరులు పరార వుతున్నారని తెలిసి వెంబడించగా సంగారెడ్డి వద్ద కార్లను వదిలి వెళ్లారు. అక్కడ కార్లను, డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిం చారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మహారాష్ట్ర బీదర్ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. ఆ మార్గంలో గాలించారు. ఆయన డ్రైవర్ ను రుద్రారం వద్ద అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. 

మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. పిన్నె ల్లిని పట్టుకోవడానికి పోలీ సులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. బీదర్ వెళ్లాలనుకున్న పిన్నెల్లి.. రూటు మార్చుకున్నట్లు గుర్తించిన పోలీసులు చివ‌ర‌కు ఇస్నాపూర్ గెస్ట్ హౌజ్ లో అదుపులోకి తీసుకున్నారు...

Previous ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్
Next ఏసీబీ వలలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్
ADVERTISEMENT