| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలి : కనుకుంట్ల పున్నo చందర్

విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలి : కనుకుంట్ల పున్నo చందర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ ముగింపు వేడుక జరిగింది.

ఈ సందర్భంగా పద్మశాలి అఫేషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ మాట్లాడుతు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలని అన్నారు.

పోపా ద్వారా ఉచిత పాలిటెక్నిక్ శిక్షణను అందించిన  ఉపాద్యాయ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

45 రోజుల శిక్షణను 25 మంది విషయ నిపుణులచే ఉచితంగా నిర్వహించుకోవడం పోపా కు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు.

మండల విద్యాధికారి దూస రఘుపతి మాట్లాడుతూ 

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాద్యాయ బృందం స్వచ్ఛందంగా బోధించుటకు ముందుకు రావడం గొప్ప విషయమని తెలిపారు.

24వ తేదీన జరిగే పాలిటెక్నిక్ పరీక్షను విద్యార్దులు ఏటువంటి గందరగోళానికి లోను కాకుండా ప్రశాంత చిత్తంతో రాయాలని సూచించినారు.

ఈ సందర్భంగా పోపా సేవలను అభినందించారు. తాను కూడా దీనిలో భాగస్వామ్యం కావడం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందనీ అన్నారు.

పోపా సభ్యులు గాజుల ప్రతాప్ మాట్లాడుతు ఉచిత పాలిటెక్నిక్ బోధన  పోపా ఉపాద్యాయుల విజయంగా అభివర్ణించారు.

భవిష్యత్తులో పోపా ద్వారా మరిన్ని కార్యక్రమాల రూప కల్పనకు ప్రేరణగా నిలిచిందని అన్నారు.

కోర్సు డైరెక్టర్ మచ్చ ఆనందం మాట్లాడుతు ఎన్నో అవాంతరాల్ని అధిగమించి విద్యార్థులకు శిక్షణ అందించడం, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాద్యాయ బృందం కృషి చేయడం అద్భుత విషయమని అన్నారు.


ఈ కార్యక్రమంలో పోపా సభ్యులు వాసాల హరి ప్రసాద్ , మండల విద్యాధికారి ధూస రఘుపతి, సభ్యులు గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం,ఆడేపు వేణు మామిడాల భూపతి, భైరి రవీందర్, సామల తిరుపతి, కొంపెల్లి కృష్ణ సాయి, కొడం పూర్ణిమ, బైరి రమాదేవి, కనుకుంట్ల తిరుమల, జక్కనీ నవీన్, శ్రీపతి శ్రీనివాస్, భూమేష్, బూర భాస్కర్, తాటిపాముల భాస్కర్, జక్కనీ శ్రీనివాస్, బండారి శ్రీనివాస్, ఉషకోల మనోహర్, ఆంకారపు జ్ఞనోభ, కొక్కుల శ్రీనివాస్ , నాగుల శ్రీనివాస్, కారంపూడి రాజేశం, వడ్నాల శ్రీనివాస్, ఇప్పకాయల ప్రకాష్, గుండెల్లి రవీందర్, లకుం సదానందం, చేరాల తిరుపతి, ప్రభాకర్,తేల్ల పూర్ణ, మిట్టపల్లి లక్ష్మణ్, గడ్డం సత్యనారాయణ, కనుకుంట్ల మధు, చౌకి చంద్ర శేకర్, శ్రీరామ్ అశోక్, ద్యవనపల్లి పరమేష్, పులి రవి కిరణ్, యెలగొండ ఆంజనేయులు, సత్యనారాయణ, ఆలువాల ఈశ్వర్ లు పాల్గొన్నారు.

Previous బిసిసిఐ సంచలన నిర్ణయం...!టీమిండియా హెడ్‌ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం?
Next తిరుమల శ్రీవారిని దర్శించుకున్న: సీఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT