డైలీ భారత్, మహబూబాబాద్: జూన్ 4 న నిర్వహించే పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో కలిసి పట్టణంలోని బస్టాండ్ దగ్గరలోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ బాలికల కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఓట్ల లెక్కింపు కి అవసరమైన ఏర్పాటును, చేయాలన్నారు.
ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను, ఆయా సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సంబంధిత ఏర్పాట్లలో బాగంగా గదులు, వసతుల మ్యాపు లను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నిశితంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
భద్రతాపరమైన అంశాలను పరిశీలిస్తూ, ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.
స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, వసతి, ఫ్యాన్లు, లైట్లు పని చేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని ప్రత్యామ్నాయంగా జెనరేటర్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, అభ్యర్థులు,ఏజెంట్ల రాకపోకల కోసం మార్గాలను,సూచికల బోర్డ్ లు పాత్రికేయుల కొరకు మీడియా సెంటర్ ఏర్పాటు ఇతర సదుపాయాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి జిల్లా కలెక్టర్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ద్వారం సీల్, తాళాలను పరిశీలించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు లోకల్ బాడీస్, రెవెన్యూ లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్ మహబూబాబాద్, మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతిరావు ఆర్డీఓ ఎల్.అలివేలు, డిప్యూటీ సీ.ఈ.ఓ నర్మద, డి.ఏ.ఓ హరిప్రసాద్, సి.ఐ దేవేందర్, ఆర్.ఐ కృష్ణ ప్రసాద్, ష్ట్రాంగ్ రూమ్ ఇంచార్జ్ డిప్యూటీ తహసీల్దార్ జర్పుల సుధాకర్ నాయక్ పాల్గొన్నారు.