డైలీ భారత్, మహబూబాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి కళావతి బాయి అన్నారు.
మహబూబాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంబేద్కర్ నగర్ నందు గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఉపకేంద్రము)ను సందర్శించి మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో సి సెక్షన్ కాన్పులు ఎక్కువగా అవుతున్నట్లు గుర్తించి సి సెక్షన్ కాన్పులను తగ్గించుటకై వైద్య ఆరోగ్య సిబ్బంది, తల్లుల సమావేశంలో గర్భిణీ స్త్రీలకు మరియు వారి బంధువులకు సాధారణ ప్రసవాల వలన చేకూరే ప్రయోజనాలను సిబ్బంది వివరించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆరోగ్య కేంద్ర పరిధిలోని క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు, అంబేద్కర్ నగర ప్రజలు కేంద్రమునకు సరియైన భవనం లేక ఇరుకు గదలలో నిర్వహిస్తున్నారని దానికి ఒక ఉప కేంద్ర భవనమును నిర్మిస్తే ఇక్కడి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, ఆవేదన వ్యక్తం చేస్తూ భవన నిర్మాణము కొరకు స్థలం కేటాయించాలని అడుగగా, వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి, మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ దృష్టికి మరియు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి ఉపకేంద్ర భవనమునకు స్థలం కేటాయించేటట్లు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
అంబేద్కర్ నగర పరిధిలోని ప్రజలు రోజువారి కూలీ చేస్తూ జీవనాధారం పొందుతున్నారని మహబూబాబాద్ జిల్లా లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు అన్ని రకాల ప్రత్యేకమైన వైద్యులు అందుబాటులో ఉన్నారని ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రుల మీద ఆధారపడకూడదని ఆమె అన్నారు.
అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాక కార్యలయం లో ఆశా నోడల్ పర్సన్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాకాధికారి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాను అన్ని ఆరోగ్య కార్యక్రమాలలో అగ్ర
బాగాన వుంచాలని, మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా చూడాలని, ఆరోగ్య కేంద్ర పరిధిలో జరుగుతున్న గర్భస్రావాల పైన నిఘా ఉంచాలని, ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించి, సాదారణ ప్రసవాల పైన ప్రజలలోమరియు గర్భిణీ స్త్రీల కు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ బిందుశ్రీ, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పుప్రసాద్, డిపిహెచ్‌ఎన్‌ఓ మంగమ్మ, ఎన్‌హెచ్‌ఎం డిపిఎంఓ రుక్ముద్దీన్, ఆశా నోడల్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.