ఎక్కువగా లారీలను సమకూరుస్తాం ఆర్ ఐ దన్ సింగ్
డైలీ భారత్, మాసాయిపేట:మాసాయిపేట మండలం రెవెన్యూ అధికారి ఆర్ఐ దన్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాసాయిపేట మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రం సెంటర్లలో ప్రతిరోజు పర్యటిస్తున్నామని రైస్ మిల్లల్లో అకాల వర్షాల కారణంగా లారీలు దొరకడం లేదని తెలిపారు అయినప్పటికీ సాధ్యమైనంతవరకు ధాన్యాన్ని తీసుకెళ్లిన లారీలను తొందరగా ఖాళీ చేయించి మాసాయిపేట గ్రామానికి లారీలను ఎక్కువగా కేటాయించాలని అధికారులను అనుకున్నప్పటికీ రైస్ మిల్లల్లో ఆలస్యమైనందున చింతిస్తున్నామని అన్నారు మాసాయిపేట గ్రామ రైతులకు ఎక్కువ లారీలను తొందరగా రప్పించి రెండు మూడు రోజుల్లో మొలకెత్తిన వడ్లను కూడా కొనుగోలు సెంటర్లో నుండి వరికుప్పలను లారీలతో రైస్ మిల్లల్లోకి పంపిస్తామని పత్రికా సమావేశంలో రెవెన్యూ అధికారులు ఆర్ ఐ దన్ సింగ్ ఇంచార్జ్ శ్రీకాంత్ పేర్కొన్నారు