| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆయిల్ పామ్ సాగు పెంచాలి

ఆయిల్ పామ్ సాగు పెంచాలి

డైలీ భారత్ ,మహబూబాబాద్ జిల్లా : ఆయిల్ పామ్ సాగు పెంచాలి...తేదీ.20.05.2024 నాడు అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులతో జిల్లా వ్యవసాయ అధికారి కోర్స అభిమన్యుడు, జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించి ఆయిల్ పామ్ సాగు చేయాలని, రైతులందరూ కూడా పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్ పంట వేసే విధంగా సకల చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారులను, ఉద్యాన అధికారులను, విస్తరణ అధికారులను సకల చర్యలు తీసుకోవాలని సూచించారు. మరియు ఆయిల్ పామ్ పంటతో స్థిరమైన ఆదాయం సుమారుగా ఎకరాకు ఒక లక్ష రూపాయలు వస్తుంది. ఈ విధంగా ఆదాయం నాలుగవ సంవత్సరము నుండి ముప్పై సంవత్సరాల వరకు వస్తుంది. 

ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ శోభన్ బాబు, శ్రీ రాజ నరేందర్ పాల్గొన్నారు

Previous ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ రిమాండ్ :సిరిసిల్ల ఇంచార్జ్ డిఎస్పీ నాగేంద్రాచారి
Next ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.కళావతి బాయి
ADVERTISEMENT