| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టిన కంటైనర్.. 8 మందికి తీవ్ర గాయాలు

టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టిన కంటైనర్.. 8 మందికి తీవ్ర గాయాలు

డైలీ భారత్, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపాడు బైపాస్‌ రోడ్డులో సోమవారం టాటా ఏస్‌ వాహనాన్ని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా ఏస్ వాహనంలో 12 మంది కలిసి నల్లగొండ నుంచి నందిపాడు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే టాటా ఏస్ బైపాస్ రోడ్డులోని స్పీడ్ బ్రేకర్ల వద్దకు రాగానే వెనుక నుంచి ఓ భారీ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. కాగా గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Previous ఏసీబీ కి చిక్కిన పంచాయతీ రాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్
Next ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు
ADVERTISEMENT